త్రిపురారం మండలంలోని కంప సాగర్ ఆదర్శ పాఠశాల బాటని అధ్యాపకుడు బోయినపల్లి రజనీకాంత్, నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్ లో గురుపూజోత్సవం సందర్భంగా జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, DEO సుశీందర్ రావు ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మల్లికంటి వెంకటేశ్వర్లు, ఇతర అధ్యాపకులు రజనీకాంత్ ను అభినందించారు.