నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి సోమవారం రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. రెడ్ క్రాస్ సేవలను అభినందించిన గవర్నర్, త్వరలోనే దేవరకొండ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో యూత్ వాలంటీర్స్ సేవలను ఉపయోగించుకోవాలని సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల చైర్మన్లు పాల్గొన్నారు.