తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు పోరాడి 1300 మంది అమరులయ్యారని, నేడు ఉద్యమకారుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పథకాలలో 20 శాతం వాటా కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వి. యాదగిరి, ఎం. డి. రఫీ తదితరులు పాల్గొన్నారు.