పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘనంగా సన్మానం

నల్గొండ జిల్లా పోలీసు శాఖలో సుమారు 35 సంవత్సరాల పాటు అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎ.ఎస్‌.ఐలు చంద్రమోహన్, పండరయ్య, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, జానీ పాషా, కానిస్టేబుల్ నజీరుద్దీన్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పదవీ విరమణ పొందిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. పోలీసు ఉద్యోగం అనేది ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అత్యంత బాధ్యతాయుతమైన సేవా రంగమని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్