పొగమంచుతో ప్రమాదాల ముప్పు

నల్గొండ జిల్లాలో చలికాలం కారణంగా ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీనివల్ల రహదారులపై వాహనదారులకు స్పష్టత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పొగమంచు వల్ల వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాలకు, తమ వాహనానికి మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ ఒక ప్రకటనలో సూచించారు.

సంబంధిత పోస్ట్