మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొనడంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.