నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్ బైపాస్ రోడ్డు నుంచి డీఈఓ ఆఫీస్ వరకు రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ. 14.45 కోట్లు మంజూరు చేసింది. గతంలో రోడ్డు విస్తరణతో ఇళ్లు, షాపులు కోల్పోతామని స్థానికులు ఆందోళన చెందడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవతో హైవేను బైపాస్ మీదుగా మళ్లించి, నిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ అభివృద్ధి పనులు నేషనల్ హైవే 565లో భాగంగా చేపట్టనున్నారు.