మృతుడి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం

తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆలకుంట్ల శేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనం యుగంధర్, సుంకిశాల రవి, బొంత ఆంజనేయులు, నాశబోయిన లింగయ్య, మైనం ప్రవీణ్, ఆలకుంట్ల మల్లేష్, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕