నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన గ్రామీణ వైద్యురాలు, సామాజిక సేవకురాలు కంబాల శివలీలకు న్యూ కంబాల శివ లీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి, ఏపీలోని గుంటూరులో మే డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య శ్రామిక స్ఫూర్తి పురస్కారం అందజేశారు. ఈ పురస్కారాన్ని యువి రత్నం, డాక్టర్ ఉషారాణి, నజీర్, సత్య వంటి ప్రముఖులు అందజేశారు. శివలీల వారికి ధన్యవాదాలు తెలిపారు.