సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో యన్ యస్ యస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డా సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్