గరిడేపల్లి మండలం గారకుంటతండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం గ్రామ సర్పంచ్ బాణోతు అరుణ రమేష్ నాయక్ పర్యవేక్షించారు. పంట కాల్వల పూడికతీత పనులు చేపడుతున్న కూలీలకు ఆమె తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాణోతు మంగతి సైదానాయక్, ఉప సర్పంచ్ గౌతమి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురభి సైదులు, ఉపాధ్యక్షుడు భూక్య రాము, వార్డు సభ్యులు బూలి బాయి, పంచాయతీ కార్యదర్శి పాల్వాయి రమ్య, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.