నల్గొండ సాగర్ రోడ్డు ఎస్ఎల్బీసీ ఐలమ్మ బొమ్మ వద్ద మంగళవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పేలడంతో అదుపుతప్పి బైకును ఢీ కొట్టింది. దీంతో అటుగా వస్తున్న వాహనదారుల ఢీకొనడంతో పరిస్థితి విషమం. వాహనదారులను ఢీకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై కారు దూసుకెళ్లింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది