హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం సాధించిన సందర్భంగా బుధవారం దేవరకొండలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం విద్యార్థుల హక్కులు, విద్యా రంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటాలకు నిదర్శనమని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ తెలిపారు.