నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు తిరుగమల్ల షాలెమ్ రాజు వెల్లడించారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని, పట్టభద్రుల సమస్యలపై తనకు ముందుగా అనుభవం ఉన్నందున వారి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.