దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దివ్యంగ క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల ద్వారా దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని, మానసిక, శారీరక సామర్ధ్యాలు పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె అన్నారు. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్