ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి

నల్లగొండ జిల్లాలో టీటీజేఏసీ, యూఎస్‌పీసీ, జేఏసీటీఓ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. గత ఏడాది ఎస్‌ఎస్‌సీ స్పాట్ మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో పనిచేసిన వారికి పారితోషికం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్