30న నల్లగొండలో రాష్ట్రస్థాయి సుస్థిర విజ్ఞాన సదస్సు

గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 'మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులు- స్వదేశీ మేళాల' కార్యక్రమం ఈ నెల 30న నల్లగొండలో జరగనుంది. ఈ విషయాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. యానాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 30న జరిగే 'రాష్ట్రస్థాయి సుస్ధిర విజ్ఞాన సదస్సు- స్వదేశీమేళ' పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్