బాలాపూర్ లడ్డూ ప్రసాదం, గణపతి విశిష్టతకు ప్రసిద్ధిగాంచిన చారిత్రక బాలాపూర్ గణనాథుడిని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలు, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నారు.