నల్గొండ: రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి

ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్