తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జిల్లాలో ఎలా పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేడి నరేష్ ప్రశ్నించారు. నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల ప్రధాన ద్వారం వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క, ఆలేరు ఇంచార్జ్ కందాడి మణిపాల్‌లతో పాటు దాదాపు 50 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.