నల్లగొండ జిల్లాలో డిసెంబర్ 5వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన థార్ గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టి నేరస్థుడిని పట్టుకుని జిల్లాకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నల్లగొండ డీపీవోలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరిన్ని వివరాలు వెల్లడించారు.