జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యం

నల్లగొండ జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ పట్టణంలో 10 బృందాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలో సుమారు 360 ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా, 46 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్