రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో కోటి 91 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.