రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగానే ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 23.75 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు.