నల్గొండను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నల్గొండను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్