నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. బాల కార్మికులను నియమించుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమంపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది.