'జిల్లా మంత్రులు ఇద్దరు అసమర్థులే'

నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అసమర్థులేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లాకు సీఎం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, నిధుల సాధనలోనూ జిల్లా మంత్రులు విఫలం చెందారని ఆయన దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ బూత్ ఏజెంట్లు ప్రతి రోజు బీఎల్‌వోతో పాటే ఇల్లులు తిరుగుతూ అన్ని పరిశీలించాలని, అందరి ఓట్లు కాపాడేలా పకడ్బందీగా పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్