పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికుల కూలి రేట్లు పెంచుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నూతన కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికులకు ఇస్తున్న రేట్లు పై పెరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.