తెలంగాణ రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్నాయి.

గత పదేళ్లలో గుంతలు కూడా పూడ్చని పరిస్థితి నుంచి తెలంగాణ రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర నిధుల నుంచి రూ. 6,500 కోట్లు కేటాయించి రోడ్ల నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు. ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో డబుల్ రోడ్ల ద్వారా అనుసంధానం చేసి పరిశ్రమలు, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్