మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ జరిగింది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంజనేయులు- భాగ్యలక్ష్మి ల కుమారుడు సోమేశ్వర్ సోమవారం ఉదయం 10 గంటలకు ఆస్పత్రి ఆవరణంలో ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లారని స్థానికులు గుర్తించారు. బాలుడు కోసం తల్లిదండ్రులు స్థానికులు ఎంత వెతికిన కనిపించకపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.