మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. మొదటి రోజు మందకొడిగా ప్రారంభమైనా, రెండో రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు చిట్యాల, చండూరు, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో రెండు రోజుల్లో మొత్తం 607 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం 44 నామినేషన్లు కాగా, గురువారం ఒక్కరోజే 563 నామినేషన్లు దాఖలయ్యాయి.