త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ఈరోజు (గురువారం) నల్గొండ పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, 11 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.