ప్రమాదాల నివారణకు డిఫెన్స్ డ్రైవింగ్‌పై అవగాహన

గత సంవత్సరం నల్లగొండ రీజియన్‌లో 0.04 శాతం యాక్సిడెంట్ రేటు నమోదైందని, దీనిని సున్నా శాతానికి తగ్గించేందుకు డ్రైవర్లకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తున్నట్లు నల్లగొండ రీజినల్ మేనేజర్ కె. జానిరెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం నల్లగొండ డిపోలో ఆర్ఎం జానిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్‌. వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్