తెలంగాణ సాధనలో కొండ లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారి త్యాగాల ముందు బీఆర్ఎస్ నేతల త్యాగాలు పనికిరావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేస్తానని, ఎవరు అడ్డు వచ్చినా తొక్కివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ, తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లోగా ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మూసి నది ప్రక్షాళనకు అడ్డువచ్చేవారిని వదిలేది లేదని హెచ్చరించారు.