రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు

రబీ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతును కొనుగోలుదారులు లేదా మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి నల్గొండ జిల్లా, కనగల్ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాక ఇదివరకే ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్