ఆత్మకూరు ఎస్: కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా ఒకరు మృతి

ఆత్మకూరు (S) మండలం కోటపహడు గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. , పలువురి కూలీలకు గాయాలయ్యాయి. మిరప చేలో కూలి కోసం వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు పల్టి కొట్టింది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్