నాలుగు సంవత్సరాల బాలుడు తప్పిపోయిన ఘటన సూర్యాపేటలో మంగళ వారం జరిగింది. స్థానిక ఏరియా ఆసుపత్రి సమీపంలో బాలుడు రోడ్డు మీద ఏడుస్తూఉండగా కెక్కిరని నాగయ్య గౌడ్ గమనించి స్పందించి ఆ బాలుడి ని 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదిగిరి గౌడ్ వద్దకు తీసుకువెళ్లారు. కౌన్సిలర్ మాట్లాడుతూ బాలుడు ఊరు ఖమ్మం చెప్తున్నాడని తప్ప పేరు ఏమి చెప్పడం లేదని బాలుడు ను గుర్తిస్తే 9908432511 నెంబర్ సంప్రదించవచ్చని తెలిపారు.