హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటికి చేరుకున్నాయి. అయితే జగదీశ్ రెడ్డిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ ఫిర్యాదు చేస్తే తీసుకోకుండా తిరిగి ఆయనపైనే కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు.