సూర్యాపేట జిల్లాలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 30 లక్షల విలువైన రెండు కార్లు, 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. గురువారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.