సూర్యాపేట: గంజాయి పై పోలీస్ శాఖ ఉక్కు పాదం

గంజాయి పై పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతుందని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం కోదాడ మండలం దొరకుంట గ్రామ శివారులో గంజాయిని విక్రయిస్తున్న పోలీసులకు చిక్కిన నిందితులు అడప రాకేష్, వనపర్తి సాయిలను సూర్యాపేట లో మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. వీరి వద్ద నుండి రూ. 2. 8 లక్షల విలువగల 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ రజిత రెడ్డి, రూరల్ పోలీసులను ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్