సూర్యాపేట: విద్యుత్ వైర్లు తెగి పడి రెండు గేదెలు మృతి

సూర్యాపేట మండలం లక్ష్మితండాలో విద్యుత్ వైర్లు తెగిపడి రెండు గేదెలు మృత్యువాత పడ్డ ఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు లోనవత్ లీలా తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయని, విద్యుత్ అధికారులకు తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మృతిచెందిన గేదెల విలువ రూ. 1, 15, 000 పైగా ఉంటుందని కన్నీటి పర్వతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్