సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానిక ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడల నుంచి చైన్ కొట్టేసి వెళ్తున్న దుండగుడిని స్థానిక ప్రజలు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజురోజుకు దొంగతనాలు విపరీతంగా అవుతున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.