సూర్యాపేట: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సామేలు వర్గపోరు

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గ పోరు శుక్రవారం తారస్థాయికి చేరుకుంది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయాలైన కార్యకర్తలను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్