ఇంపీరియల్ గార్డెన్ వద్ద అలసిపోయి కూర్చున్న వ్యక్తికి వాచ్మెన్ మంచినీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన ఆ గుర్తు తెలియని వ్యక్తి కొద్ది సేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన వాచ్మెన్ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, 108కు సమాచారం అందించాడు. ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.