బిహార్‌ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశస్థుల పేర్లు!

బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సర్వేలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. వీరంతా అక్రమంగా ఆధార్‌, రేషన్ కార్డులు పొందినట్లు సమాచారం. ఈసీ ఆగస్టు 1 నుంచి వీరి వివరాలు పరిశీలించి, అనర్హులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై ప్రతిపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సంబంధిత పోస్ట్