TG: ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను బుధవారం హైదరాబాద్ RTC X రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని కోరుకుంటున్నట్లు హీరో నాని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులకు తన విజ్ఞప్తిని పరిశీలించాలని నాని కోరారు. ప్రేక్షకుల మధ్య కూర్చుని వారి స్పందనను ప్రత్యక్షంగా ఆస్వాదించడమే అసలైన సంతృప్తి అని అవసరమైన ప్రోటోకాల్స్, భద్రతా నిబంధనలు పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేశారు.