బెంగాల్‌లో పేలిన నాఫ్తా పైప్‌లైన్‌.. 20 మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మిద్నాపూర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థకు చెందిన నాఫ్తా పైప్‌లైన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది గాయ‌ప‌డ్డారు. విషమంగా ఉన్నవారిని కోల్‌కతా ఆసుపత్రికి తరలించారు. హల్దియా మున్సిపాలిటీలోని 13వ వార్డులో కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. పైప్‌లైన్ నుంచి నాఫ్తా చోరీ చేస్తున్న సమయంలో పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే సేవలు స్తంభించాయి. మంటలను అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్