అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా తంబళ్లపల్లెలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కొందరు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.