నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి (బొందల కుంట) స్టేజి వద్ద పది రోజుల క్రితం 28 చెట్లు కాల్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జక్లేర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పొలం ఒడ్డున హరితహారం లో భాగంగా నాటిన 6-7 ఏళ్ల చెట్లను ఉద్దేశపూర్వకంగా కాల్చివేశాడు. అటవీశాఖ అధికారులకు, గ్రామ కార్యదర్శికి తెలిపినప్పటికీ చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.