ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ రాయిచూర్ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక కేశవ నగర్ కు చెందిన విజయకుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోదరితో కలిసి వస్తుండగా, ఐరన్ లోడ్ తో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా కుడివైపు తిరగడంతో విజయ్ కుమార్ దానిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన విజయ్ కుమార్ ను 108 వాహనంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕